Authorization
Fri March 28, 2025 06:06:27 pm
మహాసభను నవతెలంగాణ-నర్సంపేట
ఆగస్టు 2న షెడ్యూల్డ్ కులాల సమగ్రాభివృద్ధి సాధన మహాసభను జయప్రదం చేయాలని ఎంఆర్పీఎస్ జాతీయ కార్యదర్శి కళ్లెపెల్లి ప్రణయదీప్ మాదిగ, మలమహానాడు జిల్లా అధ్యక్షులు గుంటి వీర ప్రకాశ్, ఆర్పీఐ రాష్ట్ర కార్యదర్శి జన్ను సాంబయ్య కోరారు. శుక్రవారం పట్టణంలోని అంబేద్కర్ విజ్ఞాన కేంద్రంలో ఎంఆర్పీఎస్ పట్టణ కమిటీ అధ్యక్షులు బానాల భాస్కర్ అధ్యక్షతన నిర్వహించిన షెడ్యూలు కులాలు సమగ్ర అభివద్ధి కమిటీ సమావేశంలో వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ దళితులను మరోసారి మోసగించేందుకు దళిత బంధు పేరిట ప్రయత్నిస్తున్నాడన్నారు. దళితల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన హామీలతో పాటు దళిత బంధు రాష్ట్రమంతా అమలు చేసి నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కుట్రలను ఎదురించేందుకు దళితులు ఏకం కావాలన్నారు. ఇందుకు ఆగస్టు 2న హన్మకొండ వడ్డెపెల్లి రోడ్డులోని ఎలక్ట్రిసిటీ భవన్లో నిర్వహించనున్న షెడ్యూల్ కులాల సమగ్ర అభివద్ధి కమిటీ ఉమ్మడి వరంగల్ జిల్లా మహాసభకు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. సభకు ముఖ్య అతిథులుగా దండోరా దళపతి మందకష్ణ మాదిగ అద్దంకి దయాకర్ మాల మాల మహానాడు జాతీయ అధ్యక్షులు హాజరవుతారని తెలిపారు. సమావేశంలొ ఎంఆర్పీఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మునిగే యాకూబ్, మాలమహానాడు, ఎంఆర్పీఎస్ నాయకులు గద్ద ఎల్లయ్య, గుంటి గంటి ఈశ్వర్, వేల్పుగొండ రాజు, మాదాసి అజరు అనిల్, కమల్ సత్యం పాల్గొన్నారు.