Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నెక్కొండ రూరల్
కరోనా వ్యాక్సిన్ కోసం నెక్కొండ మండల ప్రజలు అవస్థలు వర్ణాతీతంగా నిలుస్తున్నాయి. ఆరోగ్య కేంద్రం చుట్టూ రోజులు కొద్ది తిరుగుతూ వ్యాక్సినేషన్ కోసం క్యూ కట్టిన ఫలితం లేకుండా పోతోంది. తెల్లవారుజామునుంచే పడిగాపులు కాస్తున్న చివరకు వ్యాక్సినేషన్ వేస్తారనే ధీమా లేకుండా పోయిందని పలువురు ఆవేదన చెందుతున్నారు. తెల్లవారుజామున ఆరు గంటలకు నుంచే నెక్కొండ ఆరోగ్య కేంద్రంకు చేరుకుంటున్న ప్రజలు వ్యాక్సిన్ కోసం గంటల తరబడిగా వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.ఆరోగ్య కేంద్రం, గేటు తాళం వేసివున్న సైతం పక్కన ఉన్న చిన్న గేటునుంచి మహిళలు, వృద్దులు ఇబ్బందులు పడుతూ ఆరోగ్య కేంద్రంలో చెట్ల నీడన కాచుకుంటున్నారు. ఆరోగ్య కేంద్రంలో వృద్దులు, వికలాంగులు సైతం కనీస సౌకర్యాలు లేకపోవడంతో ఇబ్బందులు తప్పడంతో లేదు. వారంలో రెండు రోజులే వ్యాక్సిన్ వేసి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రులు, జిరాక్సు కేంద్రాల చుట్టూ తిప్పుకుంటున్నారని, వారంలో కనీసం నాలుగు రోజులైన వ్యాక్సినేషన్ ప్రక్రియను సాగిస్తే ప్రజలకు అవస్థలు తప్పేవని, ప్రజల ప్రాణాలు, సహనంను పరీక్షిస్తున్నారన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మరో రెండు రోజులు వ్యాక్సినేషన్ ప్రక్రియను సాగించాలని ప్రజలు కోరుతున్నారు.