Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్‌కు బాధిత కుటుంబం ఫిర్యాదు
నవతెలంగాణ-తొర్రూరు
డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్దిదారుల ఎంపికలో అర్హు లకు అన్యాయం జరుగుతోందని మండలంలోని నాంచారి మడూరు గ్రామానికి చెందిన గిద్దె సులోచన లక్ష్మణ్ దంపతులు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్‌కు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సోమవారం ఫిర్యాదు చేశారు. అనంతరం తమ ఇంటి ఎదుట సులోచన లక్ష్మణ్ నిరసన తెలిపి మాట్లాడారు. అధికారులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్దిదారులను ఎంపిక లోపభూయిష్టంగా జరిగిందన్నారు. చీటీలు ఎవరికీ చూపకుండా డ్రా తీశారని చెప్పారు. ఎంపిక చేసిన 20 మందితోపాటు మరో 14 మంది పేదలకు ఇండ్లు ఇవ్వాలని కోరారు.