Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తొర్రూర్ టౌన్
బహుజన రాజ్యాధికారం కొరకు గౌడ కులస్తులందరూ కృషి చేయాలని మండల అభివృద్ది కమిటీ చైర్మెన్ పొనుగోటి సోమేశ్వరరావు అన్నారు. గోపా జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన కుర్ర శ్రీనివాస్‌గౌడ్‌కు సోమవారం సన్మానించారు. ఈ కార్యక్రమంలో పొనుగోటి సోమేశ్వరరావు మాట్లాడారు. సామాజిక సేవలు అందిస్తూ అందరి మన్ననలు పొంది, గౌడ కులస్తుల్లో ఐక్యత తీసుకొచ్చేలా 2004లో గౌడ సహకార పరపతి సంఘం ఏర్పాటు చేయడంలో కుర్ర శ్రీనివాస్ గౌడ్ కీలక పాత్ర పోషించినట్టు తెలిపారు. 2004 నుంచి 2013 వరకు ఆ సంఘం అధ్యక్షుడిగా కొనసాగుతూ మొదట 20 మంది సభ్యులతో ఏర్పడిన సంఘం అంచలంచెలుగా ఎదుగుతూ 60 మంది సభ్యులను చేసి తొమ్మిదేండ్లు అధ్యక్షుడిగా సంఘ అభివద్దికి కీలక పాత్ర పోషించారన్నారు. గౌడ సహకార పరపతి సంఘానికి వ్యవస్థాపక అధ్యక్షుడిగా సుమారు రెండు కోట్ల స్థిర ఆస్తితో సంఘ అభివద్ధికి తోడ్పడ్డట్టు తెలిపారు. అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ రాష్ట్రస్థాయిలో మహబూబాద్ జిల్లా కమిటీ ని ప్రథమ స్థానంలో నిలప డంలోకీలక పాత్ర పోషించా రని చెప్పారు. అనంతరం శ్రీనివాస్ మాట్లాడారు. తన ఎన్నికకు సహకరించిన తొర్రూర్ పట్టణ వివిధ గౌడ సంఘాల సభ్యులకు, తొర్రూరు డివిజన్ గోపా సభ్యులకు, మహబూబాబాద్ డివిజన్ గౌడ, గోపా సభ్యులందరికీ కతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ మంగళపల్లి రామచంద్రయ్య, తొర్రూర్ మాజీ సర్పంచ్ ధరావత్ రాజేష్‌నాయక్, కౌన్సిలర్లు ధరావత్ జైసింగ్, దొంగరి శంకర్, బిజ్జాల అనిల్, ఐజేయూ జాతీయ కౌన్సిల్ సభ్యులు దూలం శ్రీనివాస్‌గౌడ్, చీకటి శ్రీనివాస్‌గౌడ్, బిజ్జాల అశోక్, జిలకర సురేందర్, నడిగడ్డ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.