Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సాంకేతిక పరిజ్ఞానంతో నేరాల నివారణ : ఎస్పీ
నవతెలంగాణ-మహబూబాబాద్
ప్రజలు మెచ్చేలా పోలీసులు పని చేయాలని ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి కోరారు. పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి జిల్లాలో నేరాలను నివారించాలని సూచించారు. మహబూబాబాద్ టౌన్ పోలీస్‌స్టేషన్‌లోని కాన్ఫరెన్స్ తొర్రూరు సర్కిల్ పోలీసు సిబ్బందికి ఫంక్షనల్ వర్టికల్స్ అమలు తీరుపై సోమవారం సమీక్షించారు. పోలీస్స్టేషన్లలో ఫంక్షనల్ వర్టికల్స్ అమలు, రిసెప్షన్, 100 డయల్‌కు స్పందన, కోర్టు, సమన్లు, స్టేషన్ రైటర్, బ్లూకోల్డ్స్ పని తీరు విషయమై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు పోలీస్టేషన్లో ఫంక్షన్ ఫంక్షనల్ వర్టికల్స్ గురించి ఎస్సైలు నిత్యం పర్యవేక్షించి పక్కాగా అమలు చేయాలని సూచించారు. విధినిర్వహణలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉంటూ ప్రజలతో స్నేహపూర్వకంగా పని చేయాలని చెప్పారు. కేసులను ఎప్పటికప్పుడు దర్యాప్తు పూర్తి చేసి న్యాయస్థానంలో నిందితులను ప్రవేశపెట్టాలని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ దర్యాప్తులో పురోగతి సాధించి పోలీస్ శాఖలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని ఆకాంక్షించారు. నేరాలు ఎక్కువగా జరిగే ప్రాంతాల సమగ్ర సమాచారాన్ని గుర్తించాలని చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ ప్రణాళికతో ముందస్తుగా నేరనివారణ చర్యలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో తొర్రూరు డీఎస్పీ వెంకటరమణ, సీఐ కరుణాకర్, ఎస్బీ సీఐ సురేందర్, ఐటీ సెల్ సీఐ యాసీన్, పీసీఆర్ సీఐ రవిరాజు, సిబ్బంది పాల్గొన్నారు.