Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్హర్రావు
గొల్ల కురుమల సమస్యలు వెంటనే పరిష్కరిం చాలని గొల్ల, కురుమల నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో గొల్లకురుమల సీనియర్ నాయ కులు కన్నేబోయిన కిష్టా స్వామియాదవ్ మాట్లాడా రు. గొల్ల కురుమలు సామాజిక, రాజకీయ, ఆర్థిక వెనుకబాటుకు గురవుతున్నారన్నారు. గొర్లు, మేకలు కాసుకుంటూ సంచార జీవనాన్ని కొనసాగిస్తూ సమాజానికి దూరంగా బతుకుతూన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే మంథని నియోజకవర్గంలో గొల్ల కురుమలకు రెండో విడత గొర్రెలు పంపిణీ చేయాలన్నారు. గొర్ల కాపర్లకు జీవిత బీమా, ఇన్సూ రెన్స్ సౌకర్యం రూ.10లక్షలు, నెలకు రూ.3వేల పింఛను ఇవ్వాలన్నారు. చనిపోయిన గొర్లకు ఒక్కో గొర్రెకు రూ.10వేలు ఇవ్వాలని కోరారు. పశువైద్యులు ఎప్పటికప్పుడు గొర్లను పర్యవేక్షిస్తూ ఉచిత మందు లు, దాన, గడ్డి విత్తనాలు అందజేయాలన్నారు. గొర్రెల కాపరులు గొర్రెలను మేపడానికి అడవికి వెళ్తే ఫారెస్ట్ అధికారులు అడ్డుకుంటున్నారని, వెంట నే ప్రతి గ్రామానికి ఐదెకరాల భూమి కేటాయిం చాలన్నారు. మంథని నియోజకవర్గంలో చదువుకున్న గొల్ల కురుమల యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. మంథని,భూపాలపల్లి, కాటారం పట్టణాల్లో తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని, ప్రతి మండలానికి గొల్ల కుర్మలకు పక్కా భవనం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గొల్ల కురుమల జిల్లా నాయకులు అక్కల బాపుయాదవ్, మాదరబోయిన కిషన్యాదవ్, బావురవీందర్యాదవ్, బియ్యని అంకుష్యాదవ్, సాత్విక్ యాదవ్, శేఖర్యాదవ్ పాల్గొన్నారు.