Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గౌడ జన హక్కుల పోరాట సమితి
- జిల్లా అధ్యక్షులు సోమ నారాయణ
నవతెలంగాణ-పాలకుర్తి
గీత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని గౌడ జన హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు తాళ్ల సోమ నారాయణ ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం పాలకుర్తిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గీత కార్మికులు గ్రామీణ ప్రాంతాల్లో అనేక ఇబ్బందులతో పాటు అవ మానాలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రమాదం లో గాయపడిన, మృతిచెందిన గీత కార్మికులకు ఎక్స్గ్రేషియా అందించాలని డిమాండ్ చేశారు. గీత కార్మికుల సమస్యలపై చర్చించి పరిష్కరించుకు నేందుకు ఈ నెల 5న జనగామలో జిల్లా స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. గౌడ జన హక్కుల పోరాట సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఎలికట్టె విజరుకుమార్గౌడ్. రాష్ట్ర ఉపాధ్యక్షులు మూల వెంకటేశ్వర్లుగౌడ్తో పాటు రాష్ట్ర నాయకులు పాల్గొంటారని, జిల్లా స్థాయి సమావే శాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాటూరి యాకయ్య గూడ దామోదర్, కమ్మగాని పరమేశ్వర్, బండి సోమన్న, పొడిశెట్టి వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.