Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ
- ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే అభివృద్ధి జరగదు
- ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
నవతెలంగాణ-భూపాలపల్లి
దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో దళితుల సంక్షేమానికి దళిత బంధుకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారని, అభివద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని, ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే అభివద్ధి జరుగు తుందనే అపోహ మర్చిపోవాలని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో గండ్ర మాట్లాడారు. కరోనా కష్టకాలంలో ప్రజలకు భరోసానిచ్చేందుకు నిరంతరం ప్రజల మధ్యే ఉన్నది తామేనని తెలిపారు. నిన్నటి వరకు ఎక్కడ ఉన్నారో తెలియని వారు ఉనికి కోసం చిల్లర రాజకీయాలు చేస్తున్నారన్నారు. క్యాబినెట్ మీటింగ్‌లో రజకులు,నాయి బ్రాహ్మణుల షాపులకు ఉచిత కరెంట్ ప్రకటిస్తూ జీఓ జారీ చేశారన్నారు. 50వేల రుణమాఫీ, 57 ఏండ్ల వారికి పింఛను ఇవ్వ నున్నట్టు తెలిపారు. కరోనా సమయంలో పక్క రాష్ట్రాల నుంచి గొర్రెలను తీసుకురావటం కష్టం కావ డంతో యాదవులకు రూ.లక్షా70వేలు చేయూతని చ్చామన్నారు. ముదిరాజ్‌లకు చెరువులో చేపలు వారే పట్టుకోవటానికి జీఓ విడుదల చేశారన్నారు. దళిత బంధు మొదటి విడతగా రూ.250 కోట్లు విడుదల చేస్తూ పైలెట్ ప్రాజెక్టుగా హుజురాబాద్ కేంద్రంగా చేసుకొని మొదలు పెడుతున్నారన్నారు. నియోజక వర్గం లోని కొంతమంది ఇది ఎన్నికలను దష్టిలో పెట్టుకొని ప్రవేశపెట్టిన పథకం ఎన్నికల తర్వాత తిరిగి ముగిస్తుందనడం హాస్యాస్పదమన్నారు. ఉద్యో గుల బదిలీలు, ప్రమోషన్స్ పారదర్శకంగా చేపడతా మన్నారు. ఎవరి ఒత్తిళ్ల వల్ల డీడబ్ల్యూఓను బదిలీ చేయలేదన్నారు. అంగన్వాడీ జాబ్స్ కూడా పారద ర్శకంగా భర్తీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి మున్సిపల్ చైర్పర్సన్ సెగ్గెం వెంకటరాణిసిద్ధు, వైస్ చైర్మెన్ కొత్త హరిబాబు, టౌన్ ప్రెసిడెంట్ సాంబమూర్తి, టౌన్ యూత్ ప్రెసిడెంట్ బుర్ర రాజు, పీఏసీఎస్ చైర్మెన్ మేకల సంపత్, కౌన్సిలర్లు ధార పూలమ్మ, శిరుప అనిల్, ముంజల రవీందర్, మురళి, నూనె రాజు, తిరుపతి, బద్ధి సమ్మయ్య, హనుమాన్ టెంపుల్ చైర్మెన్ గడ్డం కుమార్‌రెడ్డి, కో ఆప్షన్ మెంబర్స్ దొంగల అయిలయ్య, వజ్రమణి, జిల్లా నాయకులు రఘుపతి రావు, రమేష్, దేవేందర్, రవి, రాజలింగ మూర్తి, దేవేందర్ రెడ్డి, బీబీ చారి, గండ్ర యువసేన నాయకులు శ్రీకాంత్, రఘురెడ్డి పాల్గొన్నారు.
పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
పేదల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమనారెడ్డి అన్నారు. సోమవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యా లయంలో పలువురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేసి ఆయన మాట్లాడారు. ప్రయివేటు ఆస్పత్రిలో సొంత ఖర్చుతో వైద్యం చేయించుకుని ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి సీఎంఆర్ఎఫ్ అండగా నిలుస్తుం దన్నారు. గతంలో రైతుబంధు కూడా ఇదే నియో జకవర్గం నుంచి మొదలు పెట్టామని, రాజకీయ లబ్ధి కోసం దళితబంధు కాదన్నారు. అనంతరం భూపా లపల్లికి చెందిన 14 మందికి రూ.2లక్షల45వేలు, గణపురం మండలానికి చెందిన 12మంది లబ్ధిదా రులకు రూ.2లక్షల85వేలు, రేగొండ మండలం తిరుమలగిరి గ్రామానికి చెందిన లబ్ధిదారుడికి రూ.లక్షా25వేలు, చిట్యాల, రేగొండ మండలానికి చెందిన ముర్గురికి రూ.4లక్షల70వేల సీఎంఆర్ఎఫ్, ఎల్ఓసి చెక్కులు అందజేశారు. సర్పంచులు దేవేందర్, ఎంపీటీసీ అశోక్, పీఏసీఎస్ చైర్మెన్ మేకల సంపత్, హనుమాన్ టెంపుల్ చైర్మెన్ గడ్డం కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.