Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జనగామ
వర్షాల కారణంగా అధ్వానంగా మారిన రోడ్డుకు మరమ్మతులు చేయించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక ప్రజాసంఘాల కార్యాలయంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన పాల్గొని మాట్లాడారు. జనగామ-హుస్నాబాద్ రహదారి గిర్నిగడ్డ, వడ్లకొండ గానుగుపహడ్ వాగు, మర్రిబాయి, వద్ద అధ్వానంగా మారిపోయిందని అన్నారు. వర్షం వస్తే వాహనాలు గుంతలో పడి ప్రమాదాలు నెలకొంటున్నాయన్నారు. అనునిత్యం ప్రజాప్రతినిధులు ఈ దారి గుండా ప్రయాణం చేస్తున్నా నిమ్మకు నిరెత్తినట్టు వ్యవహరించడం సరికాదన్నారు. ప్రజాప్రతినిధులు వారి వ్యక్తిగత ఆస్తులపై పెడుతున్న శ్రద్ధ ప్రజా వ్యవస్థపై పెట్టడం లేదన్నారు. ఆర్అండ్బీ అధికారులకు విన్నవించినా స్పందించట్లేదని వాపోయారు. ఉన్నతాధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలొ అవాజ్ జిల్లా నాయకులు అజారుద్దిన్, డీవైఎఫ్ఐ నాయకులు ప్రశాంత్, వినోద్ పాల్గొన్నారు.