Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తొర్రూరు
త్వరలోనే పామాయిల్ పరిశ్రమ ఏర్పాటు చేయ నున్నట్టు ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మెన్ రామకృష్ణారెడ్డి తెలిపారు. పరిశ్రమ ఏర్పాటు కోసం మండలంలోని గోపాల గిరి గ్రామంలో అధికారులు కేటాయించిన సుమారు 70 ఎకరాల స్థలాన్ని ఎంపీటీసీ అంజయ్య, రైతు బంధు సమితి మండల కోఆర్డినేటర్ అనుమాండ్ల దేవేందర్‌రెడ్డి, ఆయిల్ ఫెడ్ ఏరియా ఆఫీసర్ సురేష్‌లతో కలిసి రామకృష్ణారెడ్డి సోమవారం సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి మాట్లాడారు. హరిపిరాల గ్రామ దారిలోని కోటిలింగాల వద్ద ఏర్పాటు చేసిన నర్సరీకి లక్ష పామాయిల్ మొక్కలు రానున్నాయని తెలిపారు. మంత్రి దయాకర్‌రావు ప్రత్యేక చొరవతో గోపాలగిరిలో పామాయిల్ పరిశ్రమను నెలకొల్పబోతున్నట్టు చెప్పారు. పామాయిల్ తోటల పెంప కంపై ఈనెల 6న శ్రీనివాస గార్డెన్స్‌లో నిర్వహించనున్న అవగాహనా సదస్సుకు రైతులు పాల్గొని సందేహాలు నివత్తి చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎర్ర సంపత్, హరికృష్ణ, రేవూరి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.