Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ చీఫ్‌విప్ వినరు
నవ తెలంగాణ- హన్మకొండ
వైద్యులు ఎల్లాప్పుడూ రోగులకు అందుబాటులో ఉండాలని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ చీఫ్‌విప్ వినరుభాస్కర్ అన్నారు. సోమవారం హన్మకొండ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని రోగులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకున్నారు. అదేవిధంగా ఆసుపత్రిలో సౌకర్యాలు ఎలా ఉన్నాయి, వైద్య సిబ్బంది పనితీరు ఎలా ఉందని రోగుల బంధువులను అడిగి తెలుసుకుని వైద్య సిబ్బందిపై అసహనం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో ఉన్న బాలింతలకు పండ్లను, కేసీఅర్కిట్లను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ వైద్య రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు. కావున వైద్యులు నిర్లక్ష్యం వీడి ప్రతి రోజు విధులకు హాజరు కావాలని చెప్పారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం పెట్టి ఆస్పత్రిలో లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి ఇలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.