Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్సంపేట
ఆదివాసీలు సాగు చేసుకొంటున్న పోడు భూములను రక్షించడానికి ఐక్య పో రాటాలను చేపట్టాలని ఏఐకేఎంఎస్ జాతీయ నాయకులు ప్రసాద్, రాష్ట్ర అధ్యక్షు లు అచ్యత్ రామారావు, రాష్ట్ర సహాయ కార్యదర్శి చిన్న చంద్రన్న పిలుపునిచ్చారు. సోమవారం వాసవీ కల్యాణ మండపంలో ఈర్ల పైడి, ఎలకంటి రాజేందర్, మాడ అశోక్ అధ్యక్షతన నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్య అతిథóులుగా హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఆదిలా బాద్ మహబూబ్నగర్, నల్లగొండ జిల్లాలో ఆదివాసీలైన కొండరెడ్లు, కోయలు చెంచులు తదితర తెగలు అనాదిగా అడవిలో పుట్టి అడవిలోనే మరణిస్తున్నార న్నారు. అడవి ఆధారం చేసుకుని జీవినం సాగిస్తూ అటవీ సంపదను రక్షించుకుం టున్నారని తెలిపారు. అడవిని ఆక్రమించుకోవడానికి, సాగు భూముల నుంచి ఆది వాసీలను తరిమివేయడానికి తెలంగాణ ప్రభుత్వం పథకం ప్రకరాం నిర్భంధాన్ని కొనసాగిస్తుందన్నారు. ఆదివాసి గూడెంలపై, సాగు భూములపై ఫారెస్ట్, పోలీస్ రిజర్వ్ బలగాలతో ప్రభుత్వ యంత్రాంగం దాడులు చేస్తుందని ఆరోపించారు. కేసీఆర్ ఎన్నికల ముందు పోడు భూములకు హక్కులు కల్పిస్తానని చెప్పి అధికారం లోకి వచ్చాక పోడుభూములు సాగుచేసుకుంటున్న వారిపై దాడులు చేయిస్తు న్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైన అటవీ హక్కుల చట్టం- 2006 ద్వారా హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఏఐకే ఎంఎస్ రాష్ట్ర నాయకులు కోడి సోమన్న, మోడెం మల్లేశం, నున్నా అప్పారావు, ఆబర్ల రాజన్న, రైతుల కూలి సంఘాల నాయకులు మొగిలి ప్రతాపరెడ్డి, ఈరెల్లి రామచందర్ పాల్గొన్నారు.