Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నెక్కొండ రూరల్
నెక్కొండ మండలం గొల్లపల్లిలో ఆదివారం రాత్రి దుక్కి దున్నుతుండగా ప్రమాదవశాత్తు బావిలో ట్రాక్టర్ పడిన ఘటనలో డ్రైవర్ మృత్యువాతపడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నెక్కొండ మండలం గొల్లపల్లిలోని అప్పం చేరాలుకు చెందిన వ్యవసాయ భూమిని నల్లబెల్లి మండలం చెంద్రయ్యపల్లికి చెందిన తన కూతురుకు కౌలుకిచ్చారు. ఈ క్రమంలో ఆదివారం అల్లుడు రాజు అక్కడి ట్రా క్టర్‌ను తీసుకుని చెంద్రపల్లి గ్రామపంచాయతీ వాటర్‌మెన్‌గా పనిచేస్తున్న బరిగెల రజనీకాంత్ (32)ను డ్రైవర్‌గా ట్రాక్టర్‌తో గొల్లపల్లికి వచ్చి దుక్కి దున్నే పనిలో నిమ గమయ్యారు. దున్నుతున్న క్రమంలో ట్రాక్టర్ అదుపుతప్పి బావిలో పడిపోయింది. పోలీసులకు సమాచారమివ్వడంతో ఏసీపీ ఫణిందర్ ఆధ్వర్యంలో సీఐలు తిరుమల్, కరుణసాగర్‌రెడ్డి, ఎస్సైలు నాగరాజు, రవి, ఏఎస్సై సాంబరెడ్డి, పోలీసు సిబ్బంది, సర్పంచ్ లింగాల వెంకన్న, గ్రామస్తులు రాత్రంతా మోటార్ల సాయంతో నీటిని తోడేస్తూ సహాయక చర్యలు చేపట్టారు. సోమవారం ఉదయం ట్రాక్టర్‌ను, మృతదేహాన్ని వెలికితీశారు. మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం నర్సంపేటకు తరలించారు. ట్రాక్టర్‌ను పోలీసుస్టేషన్‌కు తరలిస్తుండగా మృతుడి కుటుంబ సభ్యులు అడ్డుకుని బాధిత కుటుంబానికి నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన దిగారు. ఈ క్రమంలో పోలీసులు బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హమీ ఇవ్వడంతో ఆందోళనకు తెరపడింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.