Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ
నవతెలంగాణ-సుబేదారి
దళితుల అందరినీ భ్రమలో ఉంచి ఓట్లు దండుకునే ప్రయత్నం సీఎం కేసీఆర్ చేస్తున్నారని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. సోమవారం హన్మకొండ కల్యాణి ఫంక్షన్హాల్లో ఎస్సీల సమగ్ర అభివృద్ధి సాధన సదస్సు నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా మందకష్ణ మాదిగ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితబంధు పథకం పేరుతో సీఎం కేసీఆర్ దళితుల ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ఏర్పడి ఏడు సంవత్సరాలు గడుస్తున్నా దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తానన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. దళితులను ముఖ్యమంత్రి చేస్తానన్న కేసీఆర్కు తమ పార్టీలో ఉన్న దళిత నేతలు కడియం శ్రీహరి, రాజయ్య, కొప్పుల ఈశ్వర్ ఎవరూ కనబడలేదా అని విమర్శించారు. దళితుడిడు ముఖ్యమంత్రిగా ఉంటే 100% దళితులకు భూమి వచ్చేదన్నారు. హుజురాబాద్లో 60% దళితుల ఓట్లు దండుకునేందుకే దళితబంధు ప్రవేశపెట్టాడని ఆరోపించారు. ఇప్పటికైనా కేసీఆర్ దళితుల అభ్యున్నతి కోసం ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు. సమావేశంలో దళిత జాతీయ అధ్యక్షుడు అద్దంకి దయాకర్, జాతీయ అధికార ప్రతినిధి తీగల ప్రదీప్, జాతీయ ఎమ్మార్పీఎస్ మేధావుల అధ్యక్షుడు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్, మంద కుమార్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.