Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్
నవతెలంగాణ-మహబూబాబాద్
రాష్ట్రంలో వైద్యానికి నిధుల కొరత లేదని ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో మహబూబాబాద్ నియోజకవర్గ పరిధిలోని గూడూరు, కేసముద్రం, నెల్లికుదురు మండలాలకు చెందిన పలువురు లబ్దిదారులకు సోమవారం ఆయన సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారానే కాకుండా ఆరోగ్యశ్రీ పథకం వర్తించని వ్యాధులకు ప్రయివేట్, కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకున్న పేదలను సీఎంఆర్ఎఫ్ నుంచి సాయం అందించి ఆదుకుంటున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ డాక్టర్ రామ్మోహన్‌రెడ్డి, గోగుల రాజు, కాసం వెంకటేశ్వరరెడ్డి, మాదరపు సత్యనారా యణరావు, యసం రమేష్, రవీందర్‌రెడ్డి, బట్టు శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
సీసీ డ్రెయినేజీ నిర్మాణానికి శంకుస్థాపన
23వ వార్డులోని భద్రన్న కాలనీలో సీసీ డ్రెయినేజీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకర్‌నాయక్ శంకుస్థాపన చేసి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాల్టీ పరిధిలోని అన్ని వార్డుల్లో అభివృద్ధి పనులు చేపడుతోందని తెలిపారు. వార్డులన్నిటినీ అందంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ డాక్టర్ రామ్మోహన్‌రెడ్డి, వార్డు కౌన్సిలర్ మార్నేని శ్రీదేవి రఘు, గోగుల రాజు, తదితరులు పాల్గొన్నారు.