Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కంపేటి రాజయ్య
నవతెలంగాణ-కోల్బెల్ట్
కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న రాష్ట్రంలోని 25వేలమంది ఆశ వర్కర్లకు రూ.10వేల ఫిక్స్డ్ వేతనం చెల్లించాలని, దానిపై 30 శాతం పీఆర్సీ అమల్జేయాలని సీఐటీయూ జయశంకర్ జిల్లా అధ్యక్షుడు కంపేటి రాజయ్య, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి మెట్టు కొండ లక్ష్మి డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం జయశంకర్ జిల్లా కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదుట నిరసన తెలిపి వారు మాట్లాడారు. పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో ఆశ వర్కర్లకు పది వేల వేతనం చెల్లిస్తున్నారని, తెలంగాణలో మాత్రం నామమాత్రపు వేతనాలు చెల్లిస్తున్నారని అన్నారు. వెంటనే తెలంగాణలో కూడా రూ.10వేల వేతనం చెల్లించాలని కోరారు. సీఎం కేసీఆర్ ప్రకటించినట్లు 30 శాతం పీఆర్సీ జూన్ నెల నుంచి అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆశ వర్కర్ల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకుంటే రాబోయే రోజుల్లో ఆందోళనలు ఉధతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో యూనియన్ నాయకులు అనిత, సరిత, నాగలత, కుమారి, స్వరూప, రజిత, రాజేశ్వరి పాల్గొన్నారు.