Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీఏసీఎస్ చైర్మెన్ సంపత్‌కుమార్ యాదవ్
నవతెలంగాణ-భూపాలపల్లి
రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ అని జంగేడు పీఏసీఎస్ చైర్మెన్ మేకల సంపత్‌కుమార్‌యాదవ్ అన్నారు. మంగళవారం జంగేడు పీఏసీఎస్ సొసైటీ కార్యాలయంలో సీఎం కేసీఆర్, స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి ఆయన మాట్లాడారు. కరోనా ఫస్ట, సెకండ్ వేవ్‌తో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు బంధు, 24 గంటల కరెంట్, రైతు బీమా, చెరువుల పూటీకా కాలువల పునరుద్ధరణ, కొత్త ప్రాజెక్టులనిర్మాణం,పాత ప్రాజెక్టుల పునరుద్ధరణ తదితరవి కొనసాగించారని తెలిపారు. కల్యాణలక్ష్మీ, షాధీముబారక్, సీఎం ఆర్ఎఫ్, రూ.11వేళ కోట్లతో గొళ్లకురుమలకు, బెస్త, ముదిరాజ్‌లకు చేప పిల్లలు, వలలు, పడవలు, తెట్టలు, వాహన సౌకర్యాలు కల్పించినట్టు తెలిపారు. గతంలో ఒక రైతుకు రెండు విద్యుత్ మోటార్లు ఉంటే రెండేండ్లకు మూడు సార్లు కాలిపోయేవన్నారు. ట్రాన్స్ఫార్మర్ల పరిస్థితి కూడా అంతేనని అన్నారు. వాటి మరమ్మతులు చేపట్టే లోగా సగం పొలం ఎండిపోయోదన్నారు. నేడు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి చొరవతో నియోజకవర్గ మొత్తం కరెంటు పోల్స్ వేయించడంతోపాటు విద్యుత్ సమస్యలు తీర్చారన్నారు. పీఏసీఎస్ సొసైటీల ఆధ్వర్యంలో మందులు, ఎరువులు రైతుల ఇంటికెళ్లి సరఫరా చేస్తున్నామన్నారు. దేశంలో మరెక్కడా లేని విధంగా దళితబంధు ప్రవేశ పెట్టారన్నారు. ఒక్కో యూనిట్ పది లక్షల రూపాయలు ఇవ్వనున్నట్టు తెలిపారు. రైతుకు మద్దతు ధర ఇచ్చి ప్రతి పల్లెల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారన్నారు. గతంలో రైతులకు రూ.25వేలు, ఇప్పుడు రూ.50 వేల లోపు రుణ మాప ిచేయడానికి నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్‌కు అందరూ రుణపడి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ డైరెక్టర్ లు పులి వేణుగోపాల్, బేడ్డల పోచయ్య, రైతుబంధు అధ్యక్షులు మామిడి కుమార్, జనాగం శ్రీనివాస్, గండి చిరంజీవి, పిట్టల రమేష్, బేతు రమేష్, పొలవేని రమేష్, జోరు నరేష్, మూడికె ఓదేలు, ప్రభాకర్, భిక్షపతి, కుమార్, మామిడి రాజయ్య, రాజు, పొక్కురి మల్లయ్య, చల్లూరి షేంకర్, బుక్య శ్రీరామ్, బత్తుల రవి, బొల్లం కుమార్, సెగ్గం రాజబాబు, రత్న భాస్కర్, ముదురుకోళ్ల భాస్కర్, గూడెపు శివ, పోనగంటి రాములు పాల్గొన్నారు.