Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు వెంకటేష్
నవతెలంగాణ-భూపాలపల్లి
మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి సాధారణ జీవితం గడిపి మొత్తం జీవితాన్ని పేద ప్రజల కోసం అంకితం చేసి సేవలందించిన సున్నం రాజయ్య ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కషి చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు జె వెంకటేష్ అన్నారు. మంగళవారం స్థానిక జిల్లా పార్టీ కార్యాల యంలో జిల్లా కమిటీ సభ్యులు వెలిశెట్టి రాజయ్య అధ్యక్షతన నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కరోనాతో మరణిం చిన రాజయ్య మొదటి వర్ధంతి జరుపుకోవడం అత్యంత బాధాకరమని అన్నారు. విద్యార్థి దశ నుండే సీపీఐ(ఎం) సిద్ధాంతాలకు ఆకర్షితులై తుది శ్వాస విడిచే వరకు కమ్యూనిస్టుల రాజ్య స్థాపనకోసం కృషి చేశాడన్నారు. పేదలు, కష్టజీవుల కోసం నిత్యం పనిచేసిన మహా నాయకుడని కొనియాడారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి సొంత కారు లేకుండా సాధారణ జీవితం గడిపి ప్రజా ప్రతినిధు లకు ఆదర్శంగా నిలిచారన్నారు. అసెంబ్లీలో అవకాశమున్న ప్రతిసారి కార్మికులు, పేద ప్రజలు పోడు భూములు, నిరుపేదల కోసం మాట్లాడిన విషయం గుర్తు చేశారు. అలాంటి మహనీయుడి నేడు లేకపోవడం బాధాకరమన్నారు. ఆయన ఆశయ సాధన కోసం పని చేయడమే సున్నం రాజయ్యకు మనమిచ్చే నివాళి అన్నారు. అనంతరం రాజయ్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి బందు సాయిలు, జిల్లా కమిటీ సభ్యులు కంపేటి రాజయ్య, పొలం రాజేందర్, గుర్రం దేవేందర్, సకినాల మల్లయ్య, బి చక్రపాణి, తదితరులు పాల్గొన్నారు.