Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతు స్వరాజ్య వేదిక జిల్లా కన్వీనర్ సమ్మయ్య
నవతెలంగాణ-భూపాలపల్లి
రాష్ట్రంలో ప్రజల ప్రాణాలు కాపాడడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని రైతు స్వరాజ్య వేదిక జిల్లా కన్వీనర్ కర్ణాటక సమ్మయ్య అన్నారు. మంగళవారం జయశంకర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో 60 మంది ఆశా వర్కర్లకు డిజిటల్ ధర్మ మీటర్లు, ఆక్సీ మీటర్లు మాస్కులు పంపిణీ చేసి ఆయన మాట్లాడారు. కరోనా విజం భిస్తున్న నేపథ్యంలో సరైన వైద్యమందక ఆక్సిజన్ లేక కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ అనేకమంది మరణిస్తున్నారన్నారు. ప్రతి గ్రామంలో ఆశా వర్కర్లు ఈ పరికరాల ద్వారా టెస్టులు చేసి వైద్యం అందిం చాలని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కనీస సౌకర్యాలు, పరికరాలు లేక సరైన వైద్యమందక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ తరుణంలో నిత్యం గ్రామల్లో సేవలందిస్తున్న ఆశా వర్కర్లను అభినందించారు. ఈ కార్యక్రమంలో హెచ్వి ప్రేమ లత, జయశంకర్ జిల్లా కో కన్వీనర్లు చల్లగురుగుల సంజీవ్, పోరుషటి మొండయ్య, ఆశా వర్కర్ల మండల ప్రెసిడెంట్ కొండ లక్ష్మి పాల్గొన్నారు.