Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నెక్కొండ రూరల్
ఉపాధ్యయ రంగంలో ఉపాధ్యాయుల సమస్యలతోపాటు తమ హక్కులను సాధించుకునేందుకు ముందుండి పోరాడి సాధించే ఘనత పీఆర్టీయూకే దక్కిందని రాష్ట్ర అధ్యక్షులు పింగిళి శ్రీపాల్‌రెడ్డి అన్నారు. నెక్కొండలో ఉన్నత పాఠశాలలో సంఘం మండల అధ్యక్షులు పింగిళి శ్రీపాల్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి శ్రీపాల్‌రెడ్డి హాజరై మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నో ఉపాధ్యాయ సంఘాలు ఉపాధ్యాయులను రెచ్చగొట్టి చివరకు సమస్యలు పరిష్కరించడం కేవలం పీఆర్టీయూతోనే సాధ్యమవుతుందని పీఆర్సీ విషయంలో నిరూపించామన్నారు. 7.5 శాతం కమిటీ సిఫారసు చేస్తే 33 శాతం ఫిట్‌మెంట్‌కు సీఎం దృష్టికి తీసుకెళ్లి సాధించామన్నారు. పట్టభధ్రుల ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో కూడా పీఆర్టీయూ ఆధ్వర్యంలో ఓటర్లను నమోదు చేయించి ఎన్నికల్లో గెలిపించే సత్తా సంఘానికి ఉన్నట్లు ముఖ్యమంత్రే గ్రహించేలా చేశామన్నారు. రిటైర్డు ఉపాధ్యాయులకు కూడా క్వాంటం ఆఫ్ పెన్షన్ వయస్సు 75 సంవత్సరాలనుంచి 70 సంవ్సతరాలకు తగ్గించి లాభం చేకూర్చే విధంగా చేశామన్నారు. ఉద్యోగుల రిటైర్మెంట్ 58 నుంచి 61 సంవత్సరాలకు పెంచేలా, సీపీఎస్ ఉద్యోగులకు కూడా ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేయించడం పీఆర్టీయూతోనే సాధ్యమైందన్నారు. ఉపాధ్యాయులందరు పీఆర్టీయూ సభ్యత్వం తీసుకోవాలన్నారు. కస్తూర్బా, ఆదర్శ పాఠశాలల ఉపాధ్యాయులు, సిబ్బంది సమస్యలను సైతం పరిష్కరించడం జరుగుతుందన్నారు. సమావేశంలో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఉమామహేశ్వర్, శ్రీహరి, మండల ప్రధాన కార్యదర్శి కర్ర యాకుబ్‌రెడ్డి, స్టేట్ అసోసియేట్ అధ్యక్షులు శ్రీధర్‌రెడ్డి, తిరుపతిరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు విజయభాస్కర్, రవి, ప్రసాద్‌రావు, వాణి తదితరులు పాల్గొన్నారు.