Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు లక్ష్మయ్య
- మొదటి వర్ధంతి సభ
నవతెలంగాణ-వాజేడు
మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్యను ప్రజల పక్షపాతిగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు దబ్బకట్ల లక్ష్మయ్య అభివర్ణించారు. మండల కేంద్రంలో పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం సున్నం రాజయ్య మొదటి వర్ధంతి సభను నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మయ్య మాట్లాడారు. రాజయ్యకు మండల ప్రజలతో విడదీయలేని అనుబంధం ఉండేదని గుర్తు చేశారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా పని చేసిన కాలంలో నిత్యం ప్రజలతో మమేకమయ్యారని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా పేదలకు అండగా నిలిచారని చెప్పారు. మండలంలోని గ్రామాల అభివద్ధికి విశేష కృషి చేశారన్నారు. వ్యవసాయ కార్మిక, రైతాంగ పోరాటాలకు అగ్రభాగాన నిలిచే వారని కొనియాడారు. సున్నం రాజయ్య స్ఫూర్తిని కొనసాగించడమే నిజమైన నివాళి అని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి కొప్పుల రఘుపతి, నాయకులు గుగ్గిళ్ల దేవయ్య, బచ్చల స్వరూప, బద్ది కిరణ్, యాలం శాంతకుమారి, దబ్బకట్ల శకుంతల, బచ్చల సౌమ్య, యాలం పాపారావు, మద్ద నరసమ్మ, మాడుగుల నర్సింహారావు పాల్గొన్నారు.