Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరంగల్ సీపీ తరుణ్ జోషి
నవతెలంగాణ-హన్మకొండ
నేరాల నియంత్రణలో ప్రజలు భాగస్వా ములు కావాలని వరంగల్ సీపీ తరుణ్ జోషి కోరారు. హన్మకొండ పోలీస్‌స్టేషన్‌లో ఆ పీఎస్ పరిధిలో ప్రజల భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను మంగళవారం సీపీ తరుణ్ జోషి ప్రారంభించారు. సిటి బస్టాండ్ సెంటర్, కాంగ్రెస్ భవన్ జంక్షన్, అశోక్ హోటల్ జంక్షన్, మాక్స్‌కేర్ ఆస్పత్రి, ఏషియన్ మాల్, జేఎన్ఎస్, తదితర కూడళ్లలో ఏర్పాటు చేసిన 30 సీసీ కెమెరాలకు సంబంధించి పోలీస్‌స్టేషన్‌లో కమాండ్ కంట్రోల్ రూమ్‌లో ఆయన ప్రారంభించి మాట్లాడారు. నేరస్తులను గుర్తించడంలో సీసీ కెమెరాలు ఉపయోగపడతా యని చెప్పారు. నేరం జరిగిన కొద్ది గంటల్లోనే నిందితులను పట్టుకోవడంతోపాటు నేరాన్ని కోర్టులో నిరూపించడంలో సీసీ కెమెరాలు ముఖ్య పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. మూడేండ్లలో రాష్ట్రంలో చైన్ స్నాచింగ్, దొంగ తనాలు, ఇతర నేరాలు భారీగా తగ్గడంలో సీసీ కెమెరాల వినియోగం ఉందన్నారు. కార్యక్రమంలో సెంట్రల్ జోన్ ఇన్‌ఛార్జి డీసీపీ పుష్ప, హన్మకొండ ఏసీపీ జితేందర్‌రెడ్డి, సీఐ వేణుమాధవ్, ఎస్సైలు రాజ్‌కుమార్, రఘుపతి, తదితరులు పాల్గొన్నారు.