Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 52 రోజులైనా కమిషనర్ ను నియమించడంలో జాప్యం !
- కార్యాలయానికి అధికారులు గైర్హాజరు పనులు కావట్లేదని ప్రజల ఆవేదన
నవతెలంగాణ-పోచమ్మ మైదాన్
వరంగల్ మహానగర పాలక సంస్థ కమిషనర్ పమేలా సత్పతి జూన్ పదమూడున పదోన్నతిపై యాదాద్రి కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. 52 రోజులు గడిచినప్పటికీ ఇంతవరకు వరంగల్ కమిషనర్‌గా ఎవరిని నియమించకపోవటం వలన పాలన గాడి తప్పిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్‌కు అనేకమైన బాధ్యతలు ఉంటాయి. కమిషనర్ బాధ్యతలు కూడా కలెక్టర్‌కే ఇంచార్జ్ కమిషనర్‌గా బాధ్యతలు అప్పజెప్పడం వల్ల క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కొరవడి అభివృద్ధి పనులు నత్తనడక నడుస్తున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంచార్జ్ కమిషనర్ కార్యాలయానికి రాకపోవడం వలన అధికారులు సైతం విధులు నిర్వర్తించడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. కమిషనర్ పర్యవేక్షణ లేక స్మార్ట్ సిటీ వంటి పనులు నత్తనడకన సాగుతున్నాయని, ఇప్పటికైనా కమిషనర్‌ను నియమించాలని ప్రజలు కోరుతున్నారు.