Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సుబేదారి
కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో బోధన, పరిశోధన రంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఇందుకోసం అధ్యాపకులు సమన్వ యంతో పనిచేయాలని కేయూ వీసీ రమేశ్ అన్నారు. మంగళవారం కళాశాలలోని సామాజిక శాస్త్రం, సోషల్ వర్క్ విభాగాల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సత్కార కార్యక్రమంలో ఆచార్య రమేష్ మాట్లాడుతూ.. ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల కు ఎంతో పేరు ఉందని ఎంతో మంది మహా నాయకులు ఇక్కడ చదువుకున్న వారు ఉన్నారని వారందరూ నేడు గొప్ప గొప్ప స్థానంలో స్థిరపడ్డారని చెప్పారు. 2021 -22 విద్యాసంవత్సరం లో ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ న్యాక్ గుర్తింపు కోసం వెళ్లవలసి ఉం టుంది. కాబట్టి బోధన పరిశోధన రంగంపై అధ్యాప కులు ప్రత్యేక దష్టి కేంద్రీకరించాలని ఆయన అన్నారు. సోషియాలజీ విభాగం అధిపతి డాక్టర్ ఐలయ్య మా ట్లాడుతూ విభాగం నుంచి ఉపకులపతిగా నియమితు లైన ఆచార్య రమేష్‌ను సత్కరించుకోవడం ఆనవాయితీ అన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపా ల్ మనోహ ర్, సోషియాలజీ విభాగం సీనియర్ ఆచార్యులు సామా జిక శాస్త్రాల విభాగం డీన్ శ్రీనివాస్, డాక్టర్ పుల్ల రమేష్, డాక్టర్ సదానందం, డాక్టర్ మాధవి, డాక్టర్ కల్యాణి, డాక్టర్ సాహితీ, డాక్టర్ సుభాష్ పాల్గొన్నారు.