Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య
నవతెలంగాణ-లింగాలఘనపురం
నిరుపేద బడుగు బలహీన వర్గాల ప్రజల సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యమని ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని తహసీల్ధార్ కార్యాలయ ఆవరణలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన కళ్యాణలక్ష్మీ, షాధిముభారక్ లబ్ధిదారులు 60 మందికి రూ. 60లక్షల6వేల960విలువైన చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేసి మాట్లాడారు. కరోన థర్డ్ వేవ్ పిల్లలపై ప్రభావం చూపదని అన్నారు. ప్రతి గ్రామంలో నర్సరీ, పల్లెప్రకతి వనం, ఎటు చూసినా చెట్లు ఉన్నాయని, సీజనల్ వ్యాధులు ప్రబలడం లేదన్నారు. ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించా లన్నారు. రైతుబంధు, బీమా, ఆసరా పింఛన్లు, కళ్యాణలక్ష్మీ షాధీముబారఖ్తోపాటు పేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు కొనసాగుతున్నదన్నారు. దేశంలోనే పేద, బడుగు బలహీన వర్గాల ప్రజలకు అండగా నిలు స్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చిట్ల జయశ్రీఉపేందర్రెడ్డి, జెడ్పీటీసీ గుడి వంశీధర్‌రెడ్డి, మండల అధ్యక్షులు బొల్లంపల్లి నాగేందర్, జిల్లా దిశ కమీటీ సభ్యురాలు ఉడుగుల భాగ్యలక్ష్మి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు దూసరి గణపతి, వైస్ ఎంపీపీ కిరణ్ కుమార్, వనపర్తి ఎంపీటీసీ గోలి రాజిరెడ్డి, మందోనిగూడెం సర్పంచ్ సత్యనారాయణ, నవాబుపేట సర్పంచ్ బూడిద జయ , మార్కెట్ వైస్ చైర్మెన్ అయిలేని ఆగిరెడ్డి, మార్కెట్ డైరెక్టర్స్ బూడిద రాజు, ఆంజనేయులు, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి గవ్వల మల్లేష్, మండల ఉపాధ్యక్షులు మధు, ఇన్చార్జి తహసీల్ధార్ దిరాజ్ , ఎంపీడీఓ సురేందర్‌నాయక్ పాల్గొన్నారు.