Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు అనిల్ చౌహాన్
నవతెలంగాణ-పాలకుర్తి
ప్రపంచ గిరిజన హక్కుల వారోత్సవాలను జయప్రదం చేసేందుకు గిరిజనులు ఐక్యం కావాలని తెలంగాణ గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు లావుడియా అనిల్ పిలుపునిచ్చారు. మంగళవారం మండల కేంద్రంలోని తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ స్మారక భవనంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో అనిల్ చౌహాన్ మాట్లాడారు. ఆగస్టు 9 నుండి 19 వరకు గిరిజన హక్కుల వారోత్సవాలు జరుగుతాయని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ తెగల తో గిరిజ నులను పిలుస్తారని ఐక్యరాజ్యసమితి ఆదిమ ప్రజలుగా తెలుపుతోందన్నారు. ప్రపంచ గిరిజన హక్కుల వారోత్స వాలపై ఐక్యరాజ్యసమితి నిర్వహించిన సెమినార్‌కు గిరిజన నేతలను ఆహ్వానించిందని గుర్తు చేశారు. గిరిజనుల సంపదను కొల్లగొట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు చేస్తున్నాయని అన్నారు. విలువైన ఖనిజ సంపదను కార్పొరేట్ సంస్థలకు అప్పగించేందుకు యత్నిస్తున్నాయన్నారు. గిరిజన తెగల హక్కులను కాల రాసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధ పడిందని ఆరోపించారు. ఎన్నికల హామీలను అమలు పరచలేదని అన్నారు. గిరిజనుల జీవన విధానాన్ని ఐక్యరాజ్యసమితి గుర్తించినప్పటికీ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనుల సంపదను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని, 10 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో గిరిజన సంఘం నాయకులు లావణ్య రమేష్‌నాయక్, బానోత్ సిద్ధునాయక్, సంతోష్‌నాయక్ లావుడియా శ్రీకాంత్‌నాయక్, తదితరులు పాల్గొన్నారు.