Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జెడ్పీటీసీ జోరుక సదయ్య
నవతెలంగాణ-మొగుళ్ళపల్లి
మండలకేంద్రంలోని అమ్మగార్డెన్ ఫంక్టన్హాల్లో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఏఐఎఫ్బి నాయకులు గండ్ర సత్యనారాయణ రావు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర రమణారెడ్డిపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని జెడ్పీటీసీ జోరుక సదయ్య అన్నారు. మంగళవారం మండలకేంద్రంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. గండ్ర రమణారెడ్డి కాంగ్రెస్ పార్టీకి మోసం చేయలేదని ఆపార్టీలో సుదీర్ఘంగా పని చేసిన వ్యక్తి రమణారెడ్డేన న్నారు. ప్రజల అభీష్టం మేరకు, భూపాలపల్లి అభివద్ధికి టీిఆర్‌ఎస్‌లో చేరినట్లు తెలిపారు. పన్నెండేండ్లు పార్టీ జిల్లా అధ్యక్షునిగా, నాలుగు సంవత్సరాలు ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా గెలిచి ప్రభుత్వ చీఫ్‌విప్‌గా బాధ్యతలు చేపట్టిన వ్యక్తి రమణారెడ్డి అని గుర్తు చేశారు. రమణారెడ్డి ఏ రోజు అవినీతికి పాల్పడలేదని ఆయన రాజకీయాల్లోకి రాక ముందే వ్యాపారాలు ఉన్నాయన్నారు. రమణారెడ్డి పై వ్యక్తిగతంగా మాట్లాడటం సరైంది కాదన్నారు. నాడు అసెంబ్లీలో తెలంగాణ తీర్మానాన్ని పాస్ చేయడంలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. గండ్ర సత్యనారాయణ రావు మారని పార్టీ లేదన్నారు. మొదటి టీడీపీ, బీజేపీ, టీఆర్ఎస్, నేడు కాంగ్రెస్ పార్టీ అంటున్నాడని ఎద్దేవా చేశారు. రమణారెడ్డి వ్యాపారులు చేస్తున్నందువల్లేే ఎన్నికల్లో ఓటుకు వెయ్యి రూపాయలు పంచాడని, సత్యనారాయణరావుకు ఉన్నది ఐదు ఎకరాలేనని ఓటుకు ఐదు వందలు ఎలా పంచాడని ప్రశ్నించారు. రమణారెడ్డి ఎదుగుదల చూసి ఓర్వలేక అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇకనైనా అసత్య ఆరోపణలు మానుకోవాలని హెచ్చరించారు. ఈ సమావేశంలో పీిఏసీఎస్ చైర్మెన్ నరసింగరావు, వైస్ ఎంపీపీ రాజేశ్వర్‌రావు, సర్పంచ్ ధర్మారావు, సర్పంచ్ల ఫోరం ఉపాధ్యక్షులు రాములు, సర్పంచ్‌లు రాజేందర్ రెడ్డి, అరవింద్‌రెడ్డి, శ్రీనివాస్, మాజీ సర్పంచ్ శ్రీహరి, నాయకులు రామారావు, భీమయ్య పాల్గొన్నారు.