Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దళిత సంఘాల నాయకుల డిమాండ్
నవతెలంగాణ-బచ్చన్నపేట
దళితబంధు పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమల్జేయాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని శ్రీనివాస ఫంక్షన్ హాల్లో మంగళవారం నిర్వహించిన దళిత సంఘాల నాయకుల సమావేశంలో ఎంఎస్ఎఫ్ జిల్లా ఇన్చార్జి పైస రాజశేఖర్ మాదిగ పాల్గొని మాట్లాడారు. దళిత బంధు హుజురాబాద్ నియోజకవర్గానికి పరిమితం చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా దళితులకు ఇవ్వాల న్నారు. అది కూడా హుజురాబాద్ ఎలక్షన్ నోటిఫికేషన్ రాక ముందే ఇవ్వాలన్నారు. ఇప్పటికే సీఎం కేసిఆర్ దళితులన్ని అన్ని రకాలుగా మోసం చేసాడన్నారు. దళిత సీఎం, మూడెకరాల భూ పంపిణీలో దళితులను మోసం చేసిన కేసీఆర్ను నమ్మే పరిస్థితుల్లో దళిత ప్రజలు లేరని అన్నారు. ఇప్పటికైనా దళితలకు మేలు చేసే కార్యక్రమలు చేపట్టాలన్నారు. రైతు బంధుకు లేని అడ్డంకులు, అర్హతలు దళితబంధుకు ఎందుకని ప్రశ్నించారంఉ. మళ్ళీ మోసం చేయాలని చూస్తే సీఎం కేసీఆర్ను రాజకీయంగా భూస్థాపితం చేస్తామ ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు అల్వాల అనిల్ కుమార్, జెఎంఐవీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అఖిల్ మాల, ఎంవైఎస్ జిల్లా నాయకులు అల్వాల రాజు, కనకం సురేష్, మాల సంఘం నాయకులు నర్సింగ నవీన్ఖకుమార్, నర్సింగ సాయికుమార్ పాల్గొన్నారు.