Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పాలకుర్తి
ప్రసవాల సంఖ్యను పెంచేందుకు వైద్య సిబ్బంది ఆశావర్కర్లు సమన్వయంతో పనిచేయాలని డిప్యూటీ డీఎంహెచ్ఓలు సుధీర్, కరుణశ్రీ సూచించారు మంగళవారం మండల కేంద్రంలోని ఉన్నత శ్రేణి ఆస్పత్రిలో వైద్య అధికారిని ప్రియాంక అధ్యక్షతన నిర్వహించిన అవగాహనా కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. కోవిడ్ కారణంగా ప్రసవాలపై దష్టి పెట్టలేదని తెలిపారు. ఆస్పత్రిలో సిబ్బంది అందుబాటులో ఉన్నారని, ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవాలయ్యేలా కషి చేయాలన్నారు. చిన్నారులను ఇబ్బందిపెట్టే నిమోనియా నివారణకు ఈ నెల 12న ప్రభుత్వం వ్యాక్సిన్ ప్రారంభిస్తుందని తెలిపారు. 6 వారాలు, 14 వారాలు, 9 నెలల చిన్నారులకు వ్యాక్సిన్ అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారిని యామిని, వైద్య సిబ్బంది రాపోలు వేణుకుమార్, నాగరాజు సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.