Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మంగపేట
మండలంలోని వాడగూడెం రిజష్టర్ సంఘమైన పగిడిద్దరాజు సమ్మక్క-సారక్క ఇసుక క్వారీ ఎల్సీసీఎస్ లిమిటెడ్ సొసైటీకే రెండు ఇసుక క్వారీ నిర్వాహణ బాధ్యతలను పీసా కమిటీ తీర్మానం మేరకు అప్పగించినట్లు తహసీల్దార్ బాబ్జీ ప్రసాద్, ఎంపీడీఓ ఇక్బాల్ హుస్సేన్, ఎంపీఓ శ్రీకాంత్ బెహరాలు తెలిపారు. ఎంపీఓ శ్రీకాంత్ బెహరా, గ్రామపంచాయతీ కార్యదర్శి సలీం పాషాల ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన పెసా గ్రామసభకు జిల్లా కార్యదర్శి కొమురం ప్రభాకర్ ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. వాడగూడెం ఇసుక క్వారీ నిర్వాహణ వల్ల గ్రామంలోని గిరిజన కుటుంబాలకు ఉపాధితో పాటు ఆర్ధికంగా ఎదుగుతారని అన్నారు. గిరిజనులంతా ఐకమత్యంగా ఉండి ఉమ్మడిగా ఇసుక క్వారీ పనులు చేసుకోవాలని సూచించారు. గ్రామంలో 159 మంది ఓటర్లుండగా పెసా గ్రామసభకు 121 మంది హాజరయ్యారు. అందులో 1/3 మంది ఓటర్లు రిజిష్టర్ సంఘమైన పగిడిద్దరాజు సమ్మక్క-సారక్క ఇసుక క్వారీ ఎల్సీసీఎస్ లిమిటెడ్ సంఘానికి అనుకూలంగా 67 మంది ఓటర్లు చేతులు లేపి మద్దతు తెలపడంతో రెండు ఇసుక క్వారీల నిర్వాహణను వారికే అప్పగించినట్లు అధికారులు తెలిపారు. సమావేశంలో పెసా మొబిలైజర్ మడి శోభన్, కులపెద్ద పాయం నాగేశ్వరరావు, గిరిజనులు పాల్గొన్నారు.