Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రేగొండ
ప్రభుత్వ ఆస్పత్రిలోనే ప్రసవాలు చేయించుకోవాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కష్ణ ఆదిత్య ప్రజలకు సూచించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని గురువారం కలెక్టర్ తనిఖీ చేసి రోగుల వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుమూల ప్రజలకు ప్రభుత్వ ఆస్పత్రిలోనే ప్రసవాల సంఖ్యను పెంచే విధంగా వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటూ సేవలందించాలని అని తెలిపారు. ఆస్పత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే రోగులకు సేవలు అందించాలని ఆదేశించారు. అనంతరం తహసీల్దార్ ఆఫీస్‌ను సందర్శించి రికార్డులను పరిశీలించారు. ప్రతి సమస్యను పారదర్శకంగా పరిష్కరించాలని తాసిల్దార్ జివాకర్వాకర్రెడ్డికి సూచించారు. అధికారులు క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించి రైతులకు సేవలు అందిస్తూ, అధికారుల సమన్వయంతో పనిచేయాలని అన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే శాఖపరమైన చర్యలు తప్పవని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సురేందర్ ఆలయ చైర్మన్ మహేందర్ సర్పంచ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.