Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేయూ వీసీ తాటికొండ రమేష్
- ఎస్డీఎల్సీఈ 2021-22 యూజీ, పీజీ అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల
నవతెలంగాణ-కేయూ క్యాంపస్
కాకతీయ యూనివర్సిటీ దూరవిద్య కేంద్రం అందిస్తున్న కోర్సులన్నీ విద్యార్థులకు అందుబాటులోకి తెస్తున్నామని కేయూ వీసీ ఆచార్య తాటికొండ రమేష్ అన్నారు.ఎస్డీఎల్సీఈ డైరెక్టర్ ఆచార్య టీ.శ్రీనివాసరావు అధ్యక్షతన సెమినార్ హాల్లో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వీసీ రమేష్ మాట్లాడుతు దూరవిద్య కేంద్రానికి ఎంతో విశిష్టత ఉందన్నారు. యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో మారుమూల ప్రాంతాల్లొని ప్రజలు చదువులకు దూరంగా ఉండి ఉద్యొగాలు చేస్తూ ఉన్నత చదువులు చదువుకునేందుకు అవకాశంకల్పిస్తునామని వివరించారు. దూరవిద్యతో ఎంతో మంది అనేకమైన ఉద్యోగాలను సాధించారని తెలిపారు. చదువులకు దూరంగా ఉన్నవారందరికీ అవకాశాలను కల్పించి విద్యను వారి ముంగిట్లోకి తీసుకువచ్చామన్నారు. దూరవిద్యలో నూతన ప్రక్రియలతోపాటు సాంకేతిక విధానంతో విద్యార్థులకు మేరుగైన విద్యను అందించేలా కృషి చేస్తామని తెలిపారు. దూరవిద్యా కేంద్రంలో ఎప్పుడూ విద్యార్థులకు అందుబాటులో ఉండే విధంగా స్టూడెంట్ సర్వీస్ సెంటర్ ఏర్పాటు చేశామని, ప్రతీ అంశాన్ని దూరవిద్య కేంద్రం వెబ్సైట్లో విద్యార్థులకు అందుబాటులో ఉంటుందని వివరించారు. ఎస్డీఎల్సీఈలో అడ్మిషన్లు పొందిన డిగ్రీ, పీజీ కోర్సుల అభ్యర్థులందరికీ ఆఘస్టులో పరీక్షలను నిర్వహిచేందుకు ఏర్పాట్లను పూర్తి చేస్తున్నాట్టు తెలిపారు. కోవిడ్‌ని దృష్టిలో పెట్టుకొని విద్యార్థులకు ఆన్లైన్ విద్యాను అందించే విధంగా చర్యలు చేపడుతామని అన్నారు. రిజీస్ట్రార్ ఆచార్య బి.వెంకట్రామిరెడ్డి, పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య పి.మల్లారెడ్డి మాట్లాడుతు అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం పరీక్షలను నిర్వహించి ఫలితాలను విడుదల చేస్తామని వివరించారు. అనంతరం ఎస్డీఎల్సీఈ 2021-22 డిగ్రీ, పీజీ కోర్సుల అడ్మిషన్ల నోటిఫికేషన్ బ్రోచర్, ప్రాస్పెక్టర్ను ఆవీష్కరిచారు. అడ్మిషన్లు పొందేవారు ఆఘస్టు 9 నుంచి సెంప్టెంబరు 15 వరకు దరఖాస్తులు ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌లోనూ సీకరిస్తామని తెలిపారు.సెప్టెంబర్ 16 నుంచి 22 తేదీ వరకు రూ.200, సెప్టెంబరు 23 నుంచి అక్టోబర్ 11వ తేదీ వరకు రూ. 500 అపరాధ రుసుముతో దరఖాస్తులు చేసుకోవచ్చని వివరించారు. సమావేశంలో డేవలప్మెంట్ అధికారి ఆచార్య వల్లూరి రామచంద్రం, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ సంకరి జ్యోతి, ఎస్డీఎల్సీఈ సైన్స్ కోర్సుల డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ సవితాజ్యోత్స్న, అదనపు పరీక్షలనియంత్రణాధికారులు డాక్టర్ కట్ల రాజేందర్, డాక్టర్ వై.వెంకయ్య, డాక్టర్ వి.జగన్, ఎస్డీఎల్సీ పీఆర్ఓ డాక్టర్ సంగాల ఎప్రామ్రాజ్ తదితరులు పాల్తొన్నారు.