Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కమలాపూర్
తల్లి పాలు బిడ్డకు శ్రేష్టమని జిల్లా సంక్షేమ అధికారి ముత్యాల సబిత అన్నారు. గురువారం మండ లంలోని వంగపల్లి గ్రామం స్థానిక పాఠశాలలో తల్లి పాల వారోత్సవాలను పురస్కరించుకొని ఐసిడిఎస్ సిడిపివో సౌందర్య అధ్యక్షతన జరిగిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. బిడ్డ పుట్టిన వెంటనే ముర్రుపాలు పట్టించాలని అన్నారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్ పర్సన్ అన్నమనేని అనిల్ చందర్ రావు మాట్లాడుతూ బాలల రక్షణకు తాము పనిచేస్తున్నా మని అన్నారు. ఆపదలో ఉన్న పిల్లలు సంరక్షిం చేందుకు 1098 చైల్డ్ లైన్‌కు సమాచారవివ్వాలన్నారు. సఖి అడ్మిన్ హైమ మాట్లాడుతూ ఆపదలో ఉన్న మహిళకి పునరావాసం కల్పిస్తూ, కౌన్సిలింగ్ , వైద్య అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యుడు సందసాని రాజేంద్ర ప్రసాద్, డీసీపీఓ పి సంతోష్‌కుమార్, ప్రొటెక్షన్ ఆఫీసర్ ఎస్ ప్రవీణ్ కుమార్, ఐసీడీఎస్ సూపర్ వైజర్ శిరీష, సఖి వన్ స్టాప్ కేంద్రం అడ్మిన్ పి హైమావతి, లీగల్ కౌన్సిలర్ కవిత, కేస్ వర్కర్ వినీల, అంగన్వాడి టీచర్లు బి ప్రభావతి, ఎస్ పద్మ, బి లలిత పాల్గొన్నారు.