Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చెన్నారావుపేట
ప్రజలు దొంగ స్వాములతో జాగ్రత్తగా ఉండాలని చెన్నారావుపేట ఎస్సై శీలం రవి అన్నారు. గురువారం మండలం లోని ఉప్పరపల్లి గ్రామంలో జాగృతి పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో నిర్వహించిన మూఢన మ్మకా లపై అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని కొంతమంది దొంగ స్వాముల వేషంలో వచ్చి మూఢనమ్మకాలను పెంచి పోషిస్తు డబ్బులు వసూలు చేస్తున్నారని అన్నారు. మూఢనమ్మకాలపై అవగాహన ఉండాలని సూచించారు. ప్రతి కుటుంబంలోనూ పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని సూచించారు. ఎవరైనా సంఘ వ్యతిరేక కార్యకలాపాలు చేసినా, గొడవలు సృష్టించినా డయల్ 100కు సమాచారమివ్వాలని అన్నారు. యువత చెడు వ్యస నాలకు అలవాటు కావొద్దని ఉన్నతమైన ఆశయాల కోసం ముందుండాలని అన్నారు. మాట్లాడారు ఈ కార్యక్రమంలో ట్రెయినీ ఎస్సై అనిల్ కుమార్, జాగృతి పోలీస్ కళాబృందం సభ్యులు నారాయణ, పోలీస్ సిబ్బంది తిరుపతి, రామకృష్ణ, ధర్మ రాజు, యువజన సంఘం గ్రామ అధ్యక్షుడు పరికి మధుకర్, ప్రజా సేవకుడు మహమ్మద్ భాష పాల్గొన్నారు.