Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చిట్యాల
కొంతకాలంగా భూ తగాదా విషయంలో పరిష్కారం కాకపోవడంతో రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన మండలంలోని కైలాస్ పురం గ్రామ శివారు శాంతినగర్ గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. రైతు సూసైడ్ నోట్లో ఉన్న వివరాల ప్రకారం శాంతినగర్ గ్రామానికి చెందిన సింగి శాల మోహన్ రావు చింతకుంట రామయ్య పల్లె గ్రామానికి చెందిన ముఖి రాల సుధాకర్ రావుకు నవాబుపేట గ్రామ శివారులో ఉన్న భూమి విషయములో కొంతకాలంగా భూమి తగాదాలు అవుతున్నాయి. తాను లేని సమయంలో భూమి దున్నరని మనస్తాపంతో అదే భూమి వద్దకు వెళ్లి పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు గ్రామస్తులు వెంటనే చిట్యాల సామాజిక ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం పరకాలకు తీసుకెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రైతు సూసైడ్ రాసుకున్న వివరాలు ఇలా ఉన్నాయి. భూమి విషయమై పలుమార్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చానని తెలిపారు. ఈ క్రమంలో తను ఊర్లో లేని సమయంలో ట్రాక్టర్ యజమాని రాజయ్యతో ముకురాల సుధాకర్‌రావు తన భూమిని ట్రాక్టర్ యజమాని రాజయ్య తో భూమి దున్నడం జరిగిందని నీవు లేని సమయంలో పోలీసులు దున్ను కొమ్మని ఫోన్ చేశాడని తెలపడంతో మనస్తాపానికి గురైన మోహన్ రావు పురుగుల మందు సేవించి పోలీసుల బాధలు భరించలేక సూసైడ్ చేసుకుంటున్నానని లెటర్ లో పేర్కొన్నారు.