Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతలెంగాణ-మహాదేవాపూర్
మండల కేంద్రంలో ఆధ్వర్యంలో
దళిత మహిళా ట్రైని ఎస్సై పై అత్యాచారం చేసిన మరిపెడ ఎస్సై శ్రీనివాస్ రెడ్డిని సర్వీసు నుండి తొలగించి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి కఠినంగా శిక్షించాలని ఎమ్మార్పీఎస్ టౌన్ ప్రెసిడెంట్ లింగాల నిఖిల్ డిమాండ్ చేశారు. గురువారం మండల కేంద్రంలోని కమాన్ పాయింట్ ఆవరణలో ధర్నా చేపట్టారు. బాధితురాలికి కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని కోరారు. దేశంలో, రాష్ట్రంలో అనగారిన వర్గాల మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకు పెరుగుతున్నాయన్నారు. రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు.కొయ్యల సత్యం మాదిగ. లింగాల సమ్మయ్య మాదిగ, మాల మహానాడు బుర్రి శివరాజు, తుడిచెర్ల దుర్గయ్య, కాటారం డివిజన్ అధ్యక్షుడు. మోతే సమ్మయ్య. ప్రధాన కార్యదర్శి చింతకుంట్ల కుమార్. యువసేన మండల అధ్యక్షుడు మంథెన రవితేజ. నాయకులు యువకులు పాల్గొన్నారు.