Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మార్పీఎస్ టీఎస్ రాష్ట్ర నాయకులు
నవతెలంగాణ-భూపాలపల్లి
రెవెన్యూ అధికారులు ఎస్సీలకు చెందిన అసైన్డ్ భూములను పీఓటి యాక్ట్‌కు వ్యతిరేకంగా ఎలాంటి క్రయవిక్రయాలు లేకున్నా దళితుల పేర్లు తీసివేసి అగ్రకులాల పేర్లను నమోదు చేసిన రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మార్పీఎస్ టీఎస్ రాష్ట్ర కార్యదర్శులు రేణిగుంట్ల కొమురయ్యచ శాస్త్రాల తిరుపతి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. భూపాలపల్లి మండల అధ్యక్షులు నెరుపటి అశోక్ మాదిగతో కలిసి వారు పాల్గొని మాట్లాడారు. అగ్రకులాల నాయకులు, రెవిన్యూ అధికారులు ఎస్సీలకు చెందినఅసైన్డ్ భూములను పీఓటీ యాక్ట్ కి వ్యతిరేఖంగా ఎలాంటి క్రయ విక్రయాలు లేకున్నా దళిత పేర్లు తీసివేశారిన ఆరోపించారు. జంగేడు గ్రామానికి చెందిన సర్వే నెంబర్ 350లో దోర్నాల మధునయ పేరు మీద ఉన్న భూమిని ఎలాంటి క్రయ విక్రయాలు చేయకుండా పట్టా కాలం నుంచి తొలగించి మున్నురుకపుకాపుకు చెెందిన గంధం రమేష్ 1-13 గుంటల భూమిని అక్రమంగా పట్టా చేసుకున్నాడన్నారు. రెవెన్యూ రికార్డు లను పరిశీలించగా మధునయ్య కుటుంబ సభ్యులు గంధం రమేష్ కుటుంబానికి ఏనాడూ విక్రయించలదని తేలిందన్నారు. అక్రమ పట్టా విషయంలో వారసురాలైన దోర్నాల సుగుణ సారయ్య భూపాలపల్లి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారన్నారు. దీంతో కేసులు నమోదు అయ్యాయన్నారు.