Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఐఎఫ్బీ రాష్ట్ర నాయకుడు గండ్ర సత్యనారాయణరావు
నవతెలంగాణ-టేకుమట్ల
నియోజకవర్గ ప్రజల కార్యకర్తల అబివృద్ధికి నా తల తెగినా సరే కార్యకర్తల పక్షాన్నే ఉంటూ వారిని కడుపులో పెట్టుకొని కాపాడుకుంటానని ఏఐఎఫ్బీ రాష్ట్ర నాయకుడు గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. గురువారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కోటగిరి సతీష్ అధ్యక్షతన నిర్వహించిన కాంగ్రెస్, ఏఐఎఫ్బీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అధికార పార్టీ నేతలు తమ కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తే ఉపేక్షించేది లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచిన స్థానిక ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కొరకే పార్టీ మారాననడం సిగ్గుచేటన్నారు. ఆయన ఆస్తులను కాపాడుకోవడానికి పార్టీ మారాడే తప్ప నియోజకవర్గ అభివద్ధికి కాదన్నారు . 1983 నుండి తనకు రాజకీయ అనుభవం ఉందని భూపాలపల్లి నియోజకవర్గంలో అభివద్ధి శూన్యమని ఆరోపించారు.పేద ప్రజలు కార్మిక కర్షక రైతు సింగరేణి వైద్య విద్య లాంటి సమస్యలపై నిత్యం అలు పెరుగని పోరాటం చేసిన వ్యక్తి గండ్ర సత్తన్న అన్నారు. భవిష్యత్లోమ కాంగ్రెస్ పార్టీ గెలుపు కొరకు సైనికుల్లా పనిచేసి భూపాలపల్లి గడ్డ కాంగ్రేస్ కు అడ్డా అనే నినాదం దేశానికి పిలుపునివ్వాలన్నారు. భూపాలపల్లిలో జరిగే కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల బహిరంగ సమావేశాన్ని విజయవంతం చేయాలన్నారు. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేజిక్కించుకోవడం ఖాయమని జోస్యం చెప్పారు. కార్యకర్తలందరూ సైనికుల్లా పనిచేయాలని సూచించారు . యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బండా శ్రీకాంత్, చిట్యాల మొగుళ్లపల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గూట్ల తిరుపతి, ఆకుతొట కుమార్, మాజీ జెడ్పీటీసీ ఓరంసమ్మయ్య నాయకులు కష్ణారెడ్డి, రాజమౌళి, సతీష్, బుచ్చయ్య తిరుపతిరెడ్డి, రాజిరెడ్డి, అన్వర్, అశోక్ పాల్గొన్నారు.