Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కవి వేముల శ్రీవేమన
నవతెలంగాణ-పాలకుర్తి
పాల్కురికి సోమనాథుడు తొలి తెలుగు విప్లవ కవి అని కవి, రచయిత వేముల శ్రీవేమన శ్రీచరణ్ సాయిదాస్ అన్నారు. గురువారం శ్రీ సోమేశ్వర లక్ష్మీ నర్సింహ స్వామి ఆలయ ప్రాంగణంలోని సోమనాథుడి విగ్రహానికి పూలమాల వేసి నివాళ్లర్పించారు. అనంతరం పాల్కురికి సోమన పదాకత సంకలనం గ్రంధావిష్కరణోత్సవ ఆహ్వాన పత్రాన్ని విడుదల చేశారు. అనంతరం సంకలనకర్త వేముల శ్రీ వేమనను ఆలయ చైర్మెన్ వెనకదాసుల రామచంద్రయ్య శర్మ అభినందించారు. ఈ సందర్భంగా కవి, రచయిత రాపోలు సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వేముల శ్రీవేమన మాట్లాడారు. పాల్కురికి సోమనాథుడి కవితా విశిష్టతను వివరించారు. సోమనాథుడిపై పలువురు కవులు రాసిన కవితలను సంపుటిగా, సంకలనంగా, గ్రంథంగా అచ్చువేయించామని తెలిపారు. ఈ కవితా సంకలన గ్రంథాన్ని ఈనెల 14న ఉదయం 10 గంటలకు శ్రీ సోమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఆవిష్కరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ వీరమనేని యాకాంతరావు, ప్రధాన అర్చకులు దేవగిరి రామన్న, లక్ష్మన్న, అనిల్ శర్మ, ఆలయ సూపరిండెంట్ వెంకటయ్య, రాములు, మెరుగు మధు, లయన్స్ క్లబ్ జోన్ చైర్మెన్ రాపాక విజరు, అధ్యక్షుడు బజ్జూరి వేణుగోపాల్, కార్యదర్శి దేవసాని కపాకర్, సోమ అశోక్బాబు, గూడూరు లెనిన్, యతిపతి శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.