Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బయ్యారం
మండల కేంద్రంలోని మెయిన్ రోడ్డు వద్ద గురువారం ఫూలే దంపతుల విగ్రహాన్ని జయసారిధి, ఎంపీపీ మౌనిక, వైస్ ఎంపీపీ తాత గణేష్, సోసైటీ డైరెక్టర్ ప్రభాకర్‌రెడ్డి గురువారం ఆవిష్కరించి మాట్లాడారు. పూలే దంపతుల విగ్రహ ప్రతిష్ట ఏర్పాటు హర్షణీయమని ప్రశంసించారు. కార్యక్రమంలో విగ్రహ నిర్వహణ కమిటీ కన్వీనర్ కొమెర వెంకన్న, కోకన్వీనర్ గౌని భాస్కర్, కమిటీ సభ్యులు కేస సందీప్, తుడుం రాజేష్, ఏనుగులు రాకేష్, తమ్మిశెట్టి రాందాస్, ముద్ద రమేష్, నాయకులు చల్లా గోవర్ధన్, తునికిపాటి నాగేందర్, జర్పుల శ్రీను, తదితరులు పాల్గొన్నారు.
గౌని భాస్కర్‌కు అభినందనలు
విగ్రహ ప్రతిష్టలో ముఖ్యపాత్రను పోషించిన బీసీ జనసభ రాష్ట్ర అధికార ప్రతి నిధి గౌని భాస్కర్‌కు గార్ల, బయ్యారం బీసీ జనసభ ఇన్‌ఛార్జి చల్లా గోవర్ధన్, కమిటీ సభ్యులు రాజు, థామస్ సునీల్, శ్రీకాంత్ తదితరులు అభినందనలు తెలిపారు.