Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గూడూరు
వరి పంటల సాగులో రసాయనిక ఎరువుల వాడకం తగ్గించి సేంద్రిక ఎరువుల వాడకంను పెంచాలని కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ మాలతీ రైతులకు సూచించారు. గూడూరు మండలం బొద్దుగొండ గ్రామంలోని రైతు వేదికలో వరి పంట సాగులో సమగ్ర ఎరువుల యాజమాన్యంపై రైతులకు గురువారం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ మాలతీ, శాస్త్రవేత్త, డిఏఓ చత్రునాయక్, శాస్త్రవేత్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరిపంట సాగులో నాటు వేసే పద్దతితోపాటు డ్రమ్ సీడర్, వెదజల్లే పద్దతితోపాటు పొడి దుక్కిలో సైతం వరి పంటను సాగు చేయాలన్నారు. అలాగే వరిలో కలుపు యాజమాన్యంపై అవగాహన కల్పించారు. శాస్త్రవేత్త క్రాంతికుమార్ మాట్లాడుతూ వరి పంటలో రసానిక ఎరువుల వాడకం తగ్గించి సేంద్రియ ఎరువుల వాడకంను పెంచాలన్నారు. డీఏఓ చత్రునాయక్ మాట్లాడుతూ ప్రతి సీజన్లో జిలుగు, జినుము వంటి పచ్చిరొట్ట ఎరువులను రైతులకు సబ్సిడిపై అందిస్తున్నామన్నారు. శ్రీలక్ష్మీనారాయణ మాట్లాడుతూ పంట నమోదును తప్పనిసరిగా మండల, గ్రామ విస్తరణ అధికారులు చేపట్టాలన్నారు. కెవికె శాస్త్ర రాములమ్మ మాట్లాడుతూ వరి నాడుమడిలో గుళికలు వేసుకుని పోడి తర్వాత నాట్లు వేసుకోవాలన్నారు. వరిలో మొగ్గి పురుగు, అగ్గి తెగులు వంటి చీడపీడల ఉదృతి గురించి వివరించారు. అలాగే రైతు గుర్రం శ్రీను పోడి దుక్కిలో సాగు చేసిన వరి పంటను పరిశీలించిన అధికారులు కలుపు యాజమాన్యంపై అవగాహన కల్పించారు. వరిలో యాజమాన్యం పద్దతులు, సాగులో వాడాల్సిన ఎరువులను రైతులకు సూచించారు. కార్యక్రమంలో కొరమండల్ ఇంటర్నెషనల్ అధికారులు మధుసూధన్, తిరుమల్‌రావు, రవిబాబు పాల్గొన్నారు.