Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గూడూరు
ఏఐసీసీ నేత, ములుగు ఎమ్మెల్యే సీతక్కపై టీఆర్ఎస్ నాయకులు విమర్శలు చేయడం సరికాదని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కత్తి స్వామి అన్నారు. మండల కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీతక్క జాతీయ నాయకురాలన్న విషయం మర్చిపోకూడదన్నారు. టీఆర్ఎస్ నాయకుల్లా కొన్ని జిల్లాలకే పరిమితమైన నాయకురాలు కాదని చెప్పారు. సీతక్క ఏజెన్సీలో ప్రజలకు సేవలు అందిస్తోందని తెలిపారు. పోడు భూముల సమస్యలపై మాట్లాడే అర్హత టీఆర్ఎస్ నాయకులకు లేదన్నారు. జాతీయ స్థాయి నాయకులపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. మంత్రి పదవుల్లో ఉన్న ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్లకు సీతక్క వ్యక్తిత్వం తెలుసన్నారు. సీతక్కపై చేసిన విమర్శలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు కంకట ఉప్పలయ్య, పూజారి శంకర్, బీరం శ్రీపాల్రెడ్డి, సంపత్, శ్రీనివాస్, శివ తదితరులు పాల్గొన్నారు.