Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చిట్యాల
వర్ష కాలం సీజన్లో దోమలు ప్రబలకుండా గడ్డి మందు స్ప్రే చేసే క్రమంలో గ్రామపంచాయతీ సిబ్బందికి అవగాహన లేకపోవడంతో ఇష్టారాజ్యంగా హరితహారం మొక్కలకు సైతం గడ్డి మందు స్ప్రే చేశారు. దీంతో మొక్కలు ఎండిపోయిన ఘటన చిట్యాల గ్రామపంచాయతీ పరిధిలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన ప్రకారం మండల కేంద్రంలో వారం రోజుల నుండి పిచ్చి మొక్కలు పెరగకుండా గడ్డి మందు స్ప్రే చేస్తున్నారు. సిబ్బందికి పంచాయతీ కార్యదర్శి, కారోబార్, ఇన్చార్జి సర్పంచ్ సరైన అవగాహన కల్పించక పోవడంతో సమస్యలు తలెత్తుతున్న పరిస్థితి. గ్రామపంచాయతీ పరిధిలో నెల రోజుల నుండి వీధిలైట్లు కొన్ని ప్రాంతాల్లో వెలగడం లేదని పాలక వర్గానికి విన్నవించినా పట్టించుకోవట్లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.