Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖానాపురం
మహిళలపై పెరుగుతున్న వేదింపులకు అడ్డుకట ్టవేయడంతోపాటు మహిళలకు అండగా సఖి కేంద్రాలు నిలుస్తాయని సఖి కోఅరినేటర్ టి సుధ అన్నారు. మండలంలోని అశోక్‌నగర్‌లో సర్పంచ్ గొర్రె కవిత అధ్యక్షతన మహిళల వేదింపులు - నివారణపై శుక్రవారం అవ గాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త సుధ మాట్లాడుతూ కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల సహ కారంతో సర్వోదయ యూత్ అర్గనైజెషన్ అధ్వర్యంలో సఖి సేవలను అందిస్తుందన్నారు. వరకట్న వెదింపులు ,బాల్య వివాహలు, అడపిల్లల అక్రమ రవాణా , బణహత్యలు , వృద్ధాప్యంలో తల్లిదండ్రుల నిర్లక్ష్యం వంటి సమస్యలపై హెల్ఫ్ లైన్ 181,100కు ఫోన్ చేయవచ్చునన్నారు. భాదిత మహి ళలకు న్యాయ సహయం, తాత్కలిక వసతి ,వైద్య సేవలు సఖి కేంద్రాలు అందిస్తాయన్నారు. ఈ సమావేశంలో సఖీ కేంద్రం సామాజిక కార్యకర్తలు నిర్మలదేవి , మంజుల, ఎంపీటీసీలు, అంగన్వాడీ టీచర్లు విజయకుమారి, అనసూర్య పాల్గొన్నారు.