Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీపీ లునావత్ కమల
నవతెలంగాణ-పర్వతగిరి
మూగ జీవాల పట్ల రైతులు, పెంపకందారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఎంపీపీ లునావత్ కమల అన్నారు. మండలం లోని అన్నారం షరీఫ్,ధూప తండా,మోత్యా తండా,రావూర్ గ్రామాల్లో శుక్రవారం గొర్రెలు, మేకలలో ఉచిత నట్టల నివారణ మందును ఎంపీపీ కమల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మూగజీవాల పెంపకం దారులు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత నట్టల నివారణ మందును సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల పశు వైద్యాధికారి డా.వి.నరేష్, సర్పంచులు యశోద, జ్యోతి, జాంరీ,గణేష్, సంతోష్, పశువైద్య సిబ్బంది అమరావతి, ఐలయ్య, వెంకన్న, లక్ష్మణ్, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మండలం లోని చింత నెక్కొండ లో సర్పంచ్ గటిక సుష్మ ఆధ్వర్యంలో నట్టల నివారణ మందును పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో పశు వైద్యాధికారి డా.రాజేష్ స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.