Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డాక్టర్ పెదమల్ల శ్రీనివాస్
నవతెలంగాణ-కేయూ క్యాంపస్
పర్యావరణాన్ని పరిరక్షించడంలో విద్యార్థులు ముందుండాలని కేయూ ప్రభుత్వ పాలనశాస్త్ర శాఖ అధిపతి డాక్టర్ పెదమల్ల శ్రీనివాస్ అన్నారు. ప్రభుత్వ పాలనశాస్త్ర విభాగంలో ఉద్యోగులు, విద్యార్థులు శ్రీనివాస్ ఆధ్వర్యంలో శ్రమదాన కార్యక్రమాన్నిశుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు ప్రతి విద్యార్థి మొక్కలు నాటడం, వాటిని పరిరక్షించి పర్యావరణాన్ని పరిరక్షించాలని పిలుపునిచ్చారు. విశ్వవిద్యాలయంలో పచ్ఛదనాన్ని పెంపొందించడంలో అందరూ ముందుకు రావాలని సూచించారు. పరియావరణాన్ని పరిరక్షించుకుంటే ప్రకృతి వల్ల సమాజం బాగుంటుందని తెలిపారు. కాకతీయ విశ్వవిద్యాలయంలో పచ్ఛని చెట్లతో మంచి వాతావరణాన్ని సంతరిచుకుంటుందని వివరించారు. కార్యక్రమంలో విభాగ సీనియర్ అధ్యక్షుడు ఆచార్య యాదగిరిరావు, డాక్టర్ టీ.శ్రీనివాసులు, డాక్టర్ చీకటి శ్రీనివాస్, విద్యార్థులు పాల్గొన్నారు.