Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి సారంపెల్లి వాసుదేవరెడ్డి
- రామన్నపేట శాఖ మహాసభలు
నవతెలంగాణ-మట్టెవాడ
సమస్యల పరిష్కారానికి ప్రజాపోరాటాలే ప్రత్యామ్నాయమని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి సారంపెల్లి వాసుదేవరెడ్డి స్పష్టం చేశారు. పాలకులు అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టాలంటే ఎర్రజెండా దారిలో పయనించాలని ఆయన సూచించారు. 29వ డివిజన్ పరిధిలోని రామన్నపేట రఘునాథ్కాలనీలో ఆ పార్టీ 8వ శాఖ మహాసభలు ఆదివారం నిర్వమించారు. మహాసభలకు ముఖ్యఅతిథిగా వాసుదేవరెడ్డితో పాటు జిల్లా కమిటీ సభ్యుడు అరూరి కుమార్ హాజరు కాగా వాసుదేవరెడ్డి జెండా ఆవిష్కరించి అమరవీరులను స్మరించారు. అనంతరం వాసుదేవరెడ్డి మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వాలు ప్రజలను భ్రమల్లో పెడుతున్నారని చెప్పారు. బీజేపీ మతో న్మాదంతో, టీఆర్ఎస్ సంక్షేమ పథకాల పేరుతో ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నాయని తెలిపారు. కార్పొరేట్ శక్తులకు పాలకులు కొమ్ముకాస్తున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధమైన పద్ధతుల్లో అనేక విషమ షరతులతో కూడిన రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చిందని చెప్పారు. రాష్ట్రంలో ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీఆర్ఎస్ అనేక హామీలు గుప్పిస్తోందని ధ్వజమెత్తారు. పాలకులు కల్పిస్తున్న భ్రమలను తొలగించేలా పార్టీ ఆధ్వర్యంలో ప్రజాపోరాటాలు నిర్మించాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు పద్మ, కొల్లోజు రమేష్, శివాజీ, వీరస్వామి, శ్రీనివాస్, బుచ్చిరాములు, జన్ను యాకయ్య, సింగారపు సుమన్, వేల్పుల రాజయ్య, కుమారస్వామి, కిరణ్, రవిచందర్, సారక్క, తదితరులు పాల్గొన్నారు.