Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య
నవతెలంగాణ-తొర్రూర్
జెడ్పీ, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల హెడ్మాస్టర్ పోస్టులను మల్టీ, జోనల్ పోస్టులుగా వర్గీకరిస్తూ జారీ చేసిన జీఓ నెంబర్ 158ని సవరించాలని యూటీఎఫ్ అధ్యక్షుడు కె జంగయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డివిజన్ కేంద్రంలోని ఆ ఫెడరేషన్ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు మురళీకృష్ణ అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి జంగయ్య ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యాశాఖలో గెజిటెడ్ కేటగిరీ పోస్టులన్నిటినీ మల్టీ జోనల్ పోస్టులుగా వర్గీకరించి హైస్కూల్ హెడ్మాస్టర్ పోస్టులను మాత్రమే వదిలేయడం సమంజసం కాదన్నారు. డిప్యూటీ డీఈఓ, హైస్కూల్ హెడ్మాస్టర్, గ్రేడ్-1, ఎంఈఓ, డైట్ లెక్చరర్ పోస్టులు, సివిల్ సర్వీస్ పోస్టులయితేే, ప్రభుత్వ జెడ్పీ హైస్కూల్ హెచ్ఎం పోస్టులు సివిల్ సర్వీస్ పోస్టులు కావా? అని ప్రశ్నించారు. రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు ాత క్యాడర్లన్ని రద్దు కాగా కొత్త క్యాడర్లను వర్గీకరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉందన్నారు. మండల పరిషత్, జిల్లా పరిషత్, ప్రభుత్వ స్కూళ్లలోని నాన్ గెజిటెడ్ టీచర్ పోస్టులను జిల్లా క్యాడర్లో ఇంటిగ్రేటెడ్ (ఏకీకత) క్యాడర్ పోస్టులుగా వర్గీకరించాలని, ఏకీకత సర్వీస్ రూల్స్ వివాదం పరిష్కారం ప్రభుత్వానికి ఇష్టం లేనట్టుందని విమర్శించారు. సమావేశంలో ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శులు సోమశేఖర్, మల్లారెడ్డి, రాష్ట్ర ఆడిట్ కమిటీ కన్వీనర్ శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి యాకూబ్, కోశాధికారి నాగమల్లయ్య, తొర్రూర్ మండల అధ్యక్షుడు భిక్షపతి, ప్రధాన కార్యదర్శి రమేష్ తదితరులు పాల్గొన్నారు.