Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీజీపీఏ రాష్ట్ర అధ్యక్షుడు చాతల్ల సదానందం
నవతెలంగాణ-హసన్‌పర్తి
రాష్ట్ర రాజకీయ పాలనలో నూతన ఒరవడి తీసుకురావాల్సిన అవసరం ఉందని టీజీపీఏ రాష్ట్ర అధ్యక్షుడు చాతల్ల సదానందం స్వేరోస్‌కు పిలుపునిచ్చారు. మండల కేంద్రం నుంచి నల్లగొండ పట్టణంలోని ఎన్జీ కాలేజీ మైదానంలో జరిగే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీన్‌కుమార్ సభకు ఆదివారం టీజీపీఏ, టీఎస్పీఏ నాయకులు బయల్దేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రిటైర్డ్ ఐపీఎస్ డాక్టర్ ఆర్ఎస్.ప్రవీణ్‌కుమార్ బీఎస్పీలోకి రాజకీయ అరంగేట్రం చేస్తున్న సందర్భంగా ఆయనకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని చెప్పారు. కార్యక్రమంలో టీఎస్పీఏ రాష్ట్ర నాయకులు కొల్లూరి రజిత, టీజీపీఏ అర్బన్ జిల్లా మహిళా వింగ్ అధ్యక్షురాలు మాచర్ల సుమలత, జిల్లా నాయకులు కొయ్యడ దేవరాజు, కెడెం సుజాత, గొర్రె సాంబరయ్య, చాతల్ల రాజబాబు తదితరులు పాల్గొన్నారు.
బహుజన గర్జన సభకు బయల్దేరిన స్వేరోస్ ఇంటర్నేషనల్ నాయకులు
నల్గొండ జిల్లాలో జరిగే బహుజన గర్జన సభకు ఆదివారం స్వేరోస్ ఇంటర్నేషనల్ వరంగల్ అర్బన్ జిల్లా ఉపాధ్యక్షుడు చాతళ్ల వేణుగోపాల్ ఆధ్వర్యంలో స్వేరోస్ ప్రతినిధులు తరలివెళ్లారు. కార్యక్రమంలో ఎలుకటి కృష్ణ, దాసరి సునీల్, మేకల రంజిత్, కొయ్యడ నవీన్, కొయ్యడ శ్రవణ్, పంగ విక్కీ తదితరులు పాల్గొన్నారు.