Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యకాస జిల్లా సహాయ కార్యదర్శి సత్యం
నవతెలంగాణ-పాలకుర్తి
ఉపాధి హామీకి బడ్జెట్ పెంచి కూలీలకు 200 రోజులు పని కల్పించి రోజుకు రూ.600లు చొప్పున వేతనం ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి సోమ సత్యం డిమాండ్ చేశారు. మండలంలోని బొమ్మర గ్రామ పంచాయతీ ఎదుట ఆదివారం ధర్నా నిర్వహించారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సర్పంచ్లకు అందజేశారు. ఈ సందర్భంగా సత్యం మాట్లాడారు. ఎన్నికల ముందు అనేక ఆచరణ సాధ్యం కానీ హామీలతో ప్రజలను మభ్యపెట్టి గద్దెనెక్కిన తర్వాత ప్రజలపై భారాలు మోపుతూ అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ పార్టీలు ప్రజలకు ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చడం లేదో చెప్పాలన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ఆదుకోవడం లేదన్నారు. ఓట్లేసిన ప్రజల కంటే కార్పొరేట్ సంస్థలు ముఖ్యమైనట్లు వ్యవహరిస్తున్నాయని ధ్వజమెత్తారు. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలు ఉపాధి అవకాశాలు కోల్పోయి ఇబ్బంది పడుతుంటే కార్పొరేట్ సంస్థలకు పాలకులు కోట్లాది రూపాయలు రాయితీలు ఇచ్చారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ వంటగ్యాస్ ధరలు భారీగా పెంచిందని తెలిపారు. పాల కులు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై సమరశీల ఉద్యమాలు నిర్వహిం చాలని కోరారు. కార్యక్రమంలో రైతు సంఘం మండల నాయకులు ముస్కు ఇంద్రారెడ్డి, ఒగ్గుల కొమురయ్య, మంద వెంకన్న, సోమ సాయి, రాచూరి అంజమ్మ, ఒగ్గుల లక్ష్మణ్, కొలిపాక ఎల్లయ్య, సోమయ్య, మంగమ్మ, గుడికందుల మదనాచారి, విజరు, ఆకుల ముత్తమ్మ, ఉప్పలయ్య, లచ్చమ్మ పాల్గొన్నారు.